ఎన్‌సీసీ ప్రహరి గోడపై సంచలన రాతలు
ABN , First Publish Date - 2020-03-02T23:55:13+05:30 IST
కశ్మీర్ విముక్తి' వివాదం మరోసారి బెంగళూరును తాకింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఎన్‌క్లేవ్‌లోని నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) ప్రహరీ గోడపై సోమవారంనాడు 'కశ్మీర్ విముక్తి' ..

బెంగళూరు: 'కశ్మీర్ విముక్తి' వివాదం మరోసారి బెంగళూరును తాకింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఎన్‌క్లేవ్‌లోని నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) ప్రహరీ గోడపై సోమవారంనాడు 'కశ్మీర్ విముక్తి' రాతలు కనిపించడం ఒక్కసారిగా సంచలనమైంది.
'కశ్మీర్ విముక్తి' రాతలను ఈస్ట్ బెంగళూరు డీసీపీ శరణప్ప ధ్రువీకరించారు. సిటీలోని కాంపౌండ్ వాల్స్‌పై ఈ రాతలను గుర్తించామని, కర్ణాటక బహిరంగ ప్రదేశాల చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా బాధ్యులెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. గతంలోనూ సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్ వ్యతిరేక నిరసనలు సమయంలోనూ కశ్మీర్ విముక్తి నినాదాలు గోడలపై కనిపించినట్టు పలువురు చెబుతున్నారు.