మొబైల్‌ఫోన్ పేలి మ‌హిళ‌, ఇద్ద‌రు చిన్నారులు మృతి

ABN , First Publish Date - 2020-08-11T18:25:07+05:30 IST

తమిళనాడులో ఒక హృదయ విదారక ఘ‌ట‌న చోటుచేసుకుంది. మొబైల్‌ఫోన్ పేల‌డంతో ఒక మహిళ‌తోపాటు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. తమిళనాడులోని కరూర్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది.

మొబైల్‌ఫోన్ పేలి మ‌హిళ‌, ఇద్ద‌రు చిన్నారులు మృతి

చెన్నై: తమిళనాడులో ఒక హృదయ విదారక ఘ‌ట‌న చోటుచేసుకుంది. మొబైల్‌ఫోన్ పేల‌డంతో ఒక మహిళ‌తోపాటు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. తమిళనాడులోని కరూర్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ముత్తులక్ష్మి (29) అనే మ‌హిళ మొబైల్‌ఫోన్‌ ఛార్జింగ్‌లో ఉంచి, ఎవ‌రితోనో మాట్లాడుతోంది. కాల్ డిస్‌కనెక్ట్ అయిన వెంట‌నే ఆ ఫోన్ పెద్ద శ‌బ్ధం చేస్తూ, పేలిపోయింది. ఈ పేలుడుతో చెల‌రేగిన‌గిన మంట‌ల్లో ముత్తులక్ష్మి కాలిపోయింది. అదే స‌మయంలో ఆమె ప‌క్క‌నున్న ఆమె పిల్ల‌లు రంజిత్(3), దీక్షిత్(2) తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీనిని గ‌మ‌నించిన స్థానికులు బాధితులు ముగ్గురినీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డి వైద్యులు వారిని ప‌రీక్షించి, వారు మృతిచెందిన‌ట్లు ధృవీక‌రించారు. కాగా మత్తుల‌క్ష్మికి బాల‌కృష్ణ అనే వ్య‌క్తితో ఆరేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. వీరి కుటుంబం క‌రూర్‌లో ఉంటోంది. ఈ దంప‌తులు ఫుడ్ స్టాల్ న‌డిపేవారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా బాల‌కృష్ణ ఇంటిని విడిచిపెట్టి ఎక్క‌డికో వెళ్లిపోయాడు. 

Updated Date - 2020-08-11T18:25:07+05:30 IST