కరోనా... వెండి మాస్కులు
ABN , First Publish Date - 2020-05-17T20:30:40+05:30 IST
కరోనా మాస్కుల్లోనూ వెండి మాస్కులొచ్చాయ్. అంటే... అన్ని సందర్భాల్లోనూ కాదు లెండి. ఓ పెళ్ళి సందర్భంగా చోటుచేసుకున్న సందర్భమిది. మొత్తంమీద కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు, కూలీలు, కార్మికులు, పేదలు మధ్యతరగతి ప్రజలు ప్రజలు అష్టకష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే...ఓ పెళ్ళి సందర్భంగా వచ్చిన అతిధులకు వెండి మాస్కులను అందించి తమ దర్పాన్ని చాటుకున్నారు సంబంధిత వ్యక్తులు.

బెంగళూరు : కరోనా మాస్కుల్లోనూ వెండి మాస్కులొచ్చాయ్. అంటే... అన్ని సందర్భాల్లోనూ కాదు లెండి. ఓ పెళ్ళి సందర్భంగా చోటుచేసుకున్న సందర్భమిది. మొత్తంమీద కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు, కూలీలు, కార్మికులు, పేదలు మధ్యతరగతి ప్రజలు ప్రజలు అష్టకష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే...ఓ పెళ్ళి సందర్భంగా వచ్చిన అతిధులకు వెండి మాస్కులను అందించి తమ దర్పాన్ని చాటుకున్నారు సంబంధిత వ్యక్తులు.
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్‌లు ధరించాలని వైద్యులు సలహా ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో తమ స్థోమతకు తగిన విధంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తున్నారు. అయితే, కర్నాటక రాష్ట్రంలోని కోటీశ్వరుల తీరే వేరుగావుంది. మాస్క్‌లు ధరించడం తప్పనిసరైన పరిస్థితుల్లో ధనవంతులు తమ డాబును చూపించడానికి వినూత్న మార్గాన్ని అన్వేషించి పోటీ పడుతున్నారు. వివాహాది శుభకార్యాలకు వచ్చే కొద్దిమందికి కూడా మాస్క్‌లు తప్పనిసరి కావడంతో వెండి మాస్క్‌లను తయారు చేయిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి, చిక్కోడి తదితర ప్రాంతాల్లో వెండి మాస్క్‌లకు డిమాండ్ అధికంగా ఉంది. వీటి ధర ఒక్కొక్కటీ రూ. 2,500 నుంచి రూ. 3 వేల వరకూ పలుకుతోందని సమాచారం. అయినప్పటికీ వారు ఏమాత్రం వెనక్కితగ్గకుండా వాటిని కొనుగోలు చేస్తున్నారు.