కనకపురా పట్టణంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-06-22T17:48:17+05:30 IST

కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని కనకపురా పట్టణంలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ చేయాలని వ్యాపారులు, ప్రజలు ముక్తకంఠంతో నిర్ణయించుకున్నారు.....

కనకపురా పట్టణంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్

బెంగళూరు (కర్ణాటక): కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని కనకపురా పట్టణంలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ చేయాలని వ్యాపారులు, ప్రజలు ముక్తకంఠంతో నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు  కనకపురా పట్టణంలోని అన్ని రాజకీయపార్టీల నేతలు, వ్యాపారులు, ప్రజలు కలిసి చర్చించి స్వచ్చందగా జులై 1వతేదీ వరకు లాక్ డౌన్ చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరగకుండా నివారించేందుకు బెంగళూరు నగరంలోని పోలీసు శాఖలో 55 ఏళ్ల వయసు పైబడిన పోలీసుకానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు హోం క్వారంటైన్ లో ఉండాలని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఆదేశించారు. దీంతోపాటు మధుమేహం, బీపీ ఉన్న వారు కూడా ఇంట్లోనే ఉండాలని పోలీసు కమిషనర్ సూచించారు. 

Updated Date - 2020-06-22T17:48:17+05:30 IST