ప్రైవేటు కంపెనీలకు కర్ణాటక సర్కారు సంచలన ఆదేశాలు

ABN , First Publish Date - 2020-04-15T16:07:18+05:30 IST

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్ రంగ కంపెనీలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది.....

ప్రైవేటు కంపెనీలకు కర్ణాటక సర్కారు సంచలన ఆదేశాలు

జీతాల్లో కోత విధించొద్దు..ఉద్యోగులను తొలగించొద్దు

బెంగళూరు (కర్ణాటక): కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్ రంగ కంపెనీలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ సందర్భంగా ఉద్యోగులను తొలగించవద్దని, వారి జీతాల్లో కోత విధించవద్దని సర్కారు ఆదేశించింది. లాక్‌డౌన్ కాలంలో కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు మంజూరు చేసి, జీతాలు చెల్లించాలని కర్ణాటక రాష్ట్ర కార్మికశాఖ కార్యదర్శి మణివన్నన్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005 కింద కఠినచర్యలు తీసుకుంటామని కార్యదర్శి హెచ్చరించారు. ఉద్యోగుల ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా తాము హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

Updated Date - 2020-04-15T16:07:18+05:30 IST