ఎస్సెస్సెల్సీ పరీక్ష తేదీలు ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-05-18T22:39:12+05:30 IST

జూన్ 25-జులై 4 మధ్య సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (ఎస్ఎస్ఎల్‌సీ) పరీక్షలు నిర్వహించనున్నట్టు కర్ణాటక

ఎస్సెస్సెల్సీ పరీక్ష తేదీలు ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

బెంగళూరు: జూన్ 25-జులై 4 మధ్య సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (ఎస్ఎస్ఎల్‌సీ) పరీక్షలు నిర్వహించనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ఈ రోజు తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎస్.సురేశ్ కుమార్ ప్రకటించారు. ప్రీ యూనివర్సిటీ కోర్స్ (పీయూసీ) ఇంగ్లిష్ పేపర్ పరీక్ష జూన్ 18న నిర్వహిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల్లో శానిటైజర్లు, మాస్కులు, స్క్రీనింగ్‌తోపాటు కోవిడ్ సంబంధిత మార్గర్శకాలను పాటిస్తామన్నారు. కాగా, కర్ణాటకలో ఇప్పటి వరకు 1,147 కోవిడ్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. 

Updated Date - 2020-05-18T22:39:12+05:30 IST