సంపూర్ణ గోవధ నిషేధంపై కర్ణాటక ఆర్డినెన్స్
ABN , First Publish Date - 2020-12-29T09:28:42+05:30 IST
కర్ణాటకలో సంపూర్ణ గోవధ నిషేధం అమలుకు ఆర్డినెన్స్‌ను జారీ చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
బెంగళూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో సంపూర్ణ గోవధ నిషేధం అమలుకు ఆర్డినెన్స్‌ను జారీ చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి యడియూరప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. విపక్షాలు కాంగ్రెస్, జేడీఎస్‌ల తీవ్ర నిరసనల మధ్యనే ఈ ఆర్డినెన్స్‌ను పాస్ చేశారు. గవర్నర్ ఆమోదం కోసం మంగళవారం ఈ ఆర్డినెన్స్‌ను పంపనున్నామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మధుస్వామి తెలిపారు.