కర్ణాటక మంత్రి భార్య, కూతురికి కరోనా వైరస్

ABN , First Publish Date - 2020-06-23T16:17:02+05:30 IST

కర్ణాటక రాష్ట్ర వైద్యవిద్యాశాఖ మంత్రి కే సుధాకర్ తండ్రితో పాటు భార్య, కుమార్తెలకు కరోనా వైరస్ సోకింది.....

కర్ణాటక మంత్రి భార్య, కూతురికి కరోనా వైరస్

బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్ర వైద్యవిద్యాశాఖ మంత్రి కే సుధాకర్ తండ్రితో పాటు భార్య, కుమార్తెలకు కరోనా వైరస్ సోకింది. మంత్రి సుధాకర్ తండ్రి దగ్గు, జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరడంతో అతనికి వైద్యపరీక్షలు చేయగా కరోనా ఉందని తేలింది. దీంతో అతన్ని క్వారంటైన్ చేశారు. అనంతరం మంత్రి సుధాకర్ భార్య, కుమార్తెలకు పరీక్ష చేయగా వారికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ‘‘దురదృష్టవశాత్తూ నా భార్య, కుమార్తెలకు కొవిడ్-19 సోకింది, వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చాం’’ అని మంత్రి సుధాకర్ మంగళవారం ట్వీట్ చేశారు. కాగా మంత్రి సుధాకర్ తో పాు అతని కుమారుడికి కూడా కరోనా పరీక్షలు చేయగా వారికి నెగిటివ్ అని రిపోర్టులో వచ్చింది. 

Read more