కర్ణాటక శాసనమండలి సమావేశంలో గందరగోళం

ABN , First Publish Date - 2020-12-15T20:44:13+05:30 IST

కర్ణాటక శాసనమండలి సమావేశంలో గందరగోళం నెలకొంది. బిల్లులు అడ్డుకుంటున్నారని..

కర్ణాటక శాసనమండలి సమావేశంలో గందరగోళం

బెంగళూరు: కర్ణాటక శాసనమండలి సమావేశంలో గందరగోళం నెలకొంది. బిల్లులు అడ్డుకుంటున్నారని చైర్మన్‌పై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ మండలి చైర్మన్‌ను కాంగ్రెస్ సభ్యులు కుర్చీ నుంచి లాగేశారు. జేడీఎస్ సభ్యుడు ధర్మగౌడ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. బీజేపీ, జేడీఎస్ పార్టీలు కలిసి అక్రమంగా..డిప్యూటీ చైర్మన్ స్థానంలో ధర్మగౌడను కూర్చోబెట్టారని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆరోపించింది. సభ అదుపులో లేనప్పుడు డిప్యూటీ చైర్మన్‌ను కూర్చోబెట్టారని కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. తప్పును సరిదిద్దేందుకే తాము ఇలా వ్యవహరించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

Updated Date - 2020-12-15T20:44:13+05:30 IST