కర్ణాటకలో లాక్‌డౌన్‌ను మరో రెండు రోజులు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-05-17T23:56:24+05:30 IST

కర్ణాటకలో లాక్‌డౌన్‌ను మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు యడియూరప్ప ప్రభుత్వం ప్రకటించింది. మే 19 అర్ధరాత్రి వరకూ..

కర్ణాటకలో లాక్‌డౌన్‌ను మరో రెండు రోజులు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం

బెంగళూరు: కర్ణాటకలో లాక్‌డౌన్‌ను మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు యడియూరప్ప ప్రభుత్వం ప్రకటించింది. మే 19 అర్ధరాత్రి వరకూ కర్ణాటకలో యధావిధిగా లాక్‌డౌన్ అమలులో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్‌డౌన్ 3 సందర్భంగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలే అప్పటివరకూ అమలులో ఉంటాయని, కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసేంత వరకూ వాటినే అమలు చేస్తామని యడియూరప్ప ప్రభుత్వం తెలిపింది.


అంతేకాదు, కర్ణాటకలో ప్రజారవాణా కూడా సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. జిల్లాల మధ్య నాన్ ఏసీ బస్సులు, బెంగళూరులో బీఎంటీసీ బస్సులను సోమవారం నుంచి నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లాక్‌డౌన్ 4.0పై కేంద్ర మార్గదర్శకాలపై స్పష్టత వచ్చిన అనంతరం ప్రజా రవాణాపై కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాలని భావిస్తోంది.

Updated Date - 2020-05-17T23:56:24+05:30 IST