కర్ణాటకలో ఏప్రిల్ 1వరకు లాక్‌డౌన్
ABN , First Publish Date - 2020-03-24T11:52:24+05:30 IST
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు.....

సీఎం ఉత్తర్వులు
బెంగళూరు (కర్ణాటక): కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అర్దరాత్రి నుంచి ఏప్రిల్ 1వతేదీ వరకు రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం యెడియూరప్ప ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు లాక్‌డౌన్ ను పాటించి సహకరించాలని సీఎం కోరారు. అంతకు ముందు సీఎం కర్ణాటక రాష్ట్రంలో పబ్లిక్, ప్రైవేటు రవాణాతోపాటు ఒలా, ఉబర్, ట్యాక్సీ , ఆటోరిక్షాలు తిరగకుండా ఆంక్షలు జారీ చేశారు. కర్ణాటకలో 33 మందికి కరోనా వైరస్ సోకడంతోపాటు ఒకరు మరణించిన నేపథ్యంలో కర్ణాటక సర్కారు ఈ వైరస్ వ్యాప్తిచెందకుండా ముందస్తు జాగ్రత్తగా లాక్‌డౌన్ ప్రకటించింది.