కర్ణాటక సెట్‌ పరీక్షలు జూలై 30, 31 తేదీల్లో

ABN , First Publish Date - 2020-05-13T21:04:26+05:30 IST

కర్ణాటక కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సెట్) జూలై 30, 31 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్..

కర్ణాటక సెట్‌ పరీక్షలు జూలై 30, 31 తేదీల్లో

బెంగళూరు: కర్ణాటక కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సెట్) జూలై 30, 31 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వథ్ నారాయణ్ తెలిపారు. బుధవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని కాలేజీలు, సంస్థలు ఇంజినీరింగ్, ఫార్మసీ, బి.ఫార్మా, ఇతర కోర్సులకు అడ్మిషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన రాష్ట్ర స్థాయి సెట్ పరీక్షలు ఇవని తెలిపారు. కొత్త నిబంధనలతో పూర్తిగా రీడిజైన్ చేసిన నాలుగో దఫా లాక్‌డౌన్ ఈనెల 18 నుంచి మొదలవుతుందని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో కర్ణాటక సెట్ పరీక్షల నిర్వహణ ప్రకటన వెలువడింది.

Read more