ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కర్నాటక బీజేపీ... వారెవరంటే...

ABN , First Publish Date - 2020-06-18T22:36:19+05:30 IST

జేడీఎస్ సర్కార్ కుప్పకూలడానికి సహకరించిన బీజేపీ ఎమ్మెల్యేలకు అధిష్ఠానం గురువారం తగిన

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కర్నాటక బీజేపీ... వారెవరంటే...

బెంగళూరు : జేడీఎస్ సర్కార్ కుప్పకూలడానికి సహకరించిన బీజేపీ ఎమ్మెల్యేలకు అధిష్ఠానం గురువారం తగిన బహుమానం ప్రకటించింది. ఏడు స్థానాల్లో జరగబోయే కౌన్సిల్ ఎన్నికల్లో నలుగురిని తమ అభ్యర్థులుగా ప్రకటించింది బీజేపీ. ప్రతాప్ సింహ నాయక్, నాగరాజ్, శంకర్, సునీల్ వాల్యాపూరే... వీరిని కౌన్సిల్ అభ్యర్థులుగా ప్రకటించింది.


ఎం.టీ.బీ నాగరాజ్ గతంలో కాంగ్రెస్ నాయకుడు. పెద్ద వ్యాపారవేత్త. తాను అధిష్ఠానానికి విధేయుడిగానే ఉంటానని కాంగ్రెస్ నేతలకు హామీ ఇచ్చిన కొద్ది గంటల్లోనే రెబెల్స్ శిబిరంలో చేరి... కాంగ్రెస్‌కు షాకిచ్చారు. ఆర్... శంకర్... స్వతంత్ర ఎమ్మెల్యే.. ఆ తరువాత బీజేపీలో చేరారు. అయితే బీజేపీకి విధేయత ప్రకటించిన జేడీఎస్ మాజీ అధ్యక్షుడు హెచ్. విశ్వనాథ్‌ను మాత్రం బీజేపీ తన అభ్యర్థిగా ఎన్నుకోలేదు. 

Updated Date - 2020-06-18T22:36:19+05:30 IST