క‌రోనా త‌దుప‌రి హాట్‌స్పాట్‌లుగా తెలంగాణ, క‌ర్నాట‌క‌‌!

ABN , First Publish Date - 2020-07-08T18:07:30+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా అంత‌కంత‌కూ విజృంభిస్తూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా ప్ర‌భావం దేశంలోని మూడు రాష్ట్రాల్లో అత్య‌ధికంగా క‌నిపించింది. అయితే ఇప్పుడు తెలంగాణ...

క‌రోనా త‌దుప‌రి హాట్‌స్పాట్‌లుగా తెలంగాణ, క‌ర్నాట‌క‌‌!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా అంత‌కంత‌కూ విజృంభిస్తూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా ప్ర‌భావం దేశంలోని మూడు రాష్ట్రాల్లో అత్య‌ధికంగా క‌నిపించింది. అయితే ఇప్పుడు తెలంగాణ, కర్నాటక‌లు కరోనా తదుపరి హాట్‌స్పాట్‌లుగా మారుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ రాష్ట్రాల్లో న‌మోద‌వుతున్న‌కరోనా కేసుల వృద్ధి రేటు ప్ర‌మాద‌క‌రంగా ప‌రిణ‌మిస్తున్న‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. మంగళవారం నాటికి తెలంగాణలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 25,733 కు చేరుకుంది. దీంతో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తరువాత తెలంగాణ‌లో అత్య‌ధిక క‌రోనా కేసులు ఉన్నాయి. తెలంగాణ‌లో గత రెండు వారాల్లో కరోనా కేసుల‌ సంఖ్య వేగంగా పెరిగింది. ప్రతిరోజూ సగటున 1,219 కొత్త కేసులు నమోదవుతున్నాయి. క‌రోనా టెస్టుల విష‌యంలోనూ తెలంగాణ వెనుకబడి ఉంది. క‌రోనా కేసుల విష‌యంలో తెలంగాణ త‌రువాతి స్థానంలో క‌ర్నాట‌క నిలిచింది.  ఈ రాష్ట్రంలో మంగళవారం నాటికి మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 25,317గా ఉంది. గత రెండు వారాల్లో కర్నాటకలో ప్రతిరోజూ 1,137 కొత్త కేసులు నమోదవుతున్నాయి. 

Updated Date - 2020-07-08T18:07:30+05:30 IST