పీఏకి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌లోకి అదనపు డీజీపీ..

ABN , First Publish Date - 2020-06-23T02:14:06+05:30 IST

తన వ్యక్తిగత సహాయకుడికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో కర్నాటకలోని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు..

పీఏకి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌లోకి అదనపు డీజీపీ..

బెంగళూరు: తన వ్యక్తిగత సహాయకుడికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో కర్నాటకలోని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇటీవల పలువురు సహచరులు కరోనా బారిన పడడంతో అనేక మంది పోలీసులు, వారి కుటుంబాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే.  శాంతి భద్రతల విభాగంలో అదనపు డీజీపీగా ఉన్న అమర్ కుమార్ పాండే మాట్లాడుతూ... ‘‘అవును నా వ్యక్తిగత సహాయకుడికి కరోనా వైరస్ సోకింది. దీంతో నేను హోంక్వారంటైన్‌లో ఉన్నాను..’’ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కర్నాటక రాష్ట్ర రిజర్వ్ పోలీసు విభాగానికి చెందిన 56 మంది సిబ్బందికి కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించామని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. 

Updated Date - 2020-06-23T02:14:06+05:30 IST