కరైకల్ జిల్లా కలెక్టరుకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-08-07T15:30:12+05:30 IST

పుదుచ్చేరిలోని కరైకల్ జిల్లా కలెక్టరుకు కొవిడ్ -19 పాజిటివ్ అని తేలింది.....

కరైకల్ జిల్లా కలెక్టరుకు కరోనా పాజిటివ్

కరైకల్ (పుదుచ్చేరి): పుదుచ్చేరిలోని కరైకల్ జిల్లా కలెక్టరుకు కొవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. తిరువారూర్ ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రిలో గురువారం రాత్రి కరైకల్ జిల్లా కలెక్టరు అర్జున్ శర్మకు కరోనా పరీక్ష చేయగా, పాజిటివ్ అని వెల్లడైంది. దీంతో కలెక్టరు అర్జున్ శర్మను హోంక్వారంటైన్ లోకి వెళ్లారు. కలెక్టరు శర్మకు అసింప్టమాటిక్ కరోనా అని, మరో ఏడు రోజుల తర్వాత మరో పరీక్ష చేసి పరిశీలనలో ఉంచామని వైద్యశాఖ డిప్యూటీ డైరెక్టరు మోహన్ రాజ్ చెప్పారు. జిల్లా కలెక్టరేట్ ను పూర్తిగా మూసివేసి శానిటైజ్ చేశామని వైద్యులు చెప్పారు. ముందుగా కలెక్టరు వంటమనిషికి కరోనా సోకింది. దీంతో కలెక్టరు కూడా కరోనా పరీక్ష చేయించుకోవడంతో ఆయనకు పాజిటివ్ అని తేలింది. 

Updated Date - 2020-08-07T15:30:12+05:30 IST