ఇంత క్లిష్ట సమయంలో అమిత్‌షా మౌనమా? కపిల్ సిబాల్

ABN , First Publish Date - 2020-03-28T19:48:22+05:30 IST

దేశమంతా లాక్‌డౌన్, వలస వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్న క్లిష్ట సమయంలో కేంద్ర హోంమంత్రి

ఇంత క్లిష్ట సమయంలో అమిత్‌షా మౌనమా? కపిల్ సిబాల్

న్యూఢిల్లీ : దేశమంతా లాక్‌డౌన్, వలస వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్న క్లిష్ట సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మౌనంగా ఉండటం ఏంటని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ సూటిగా ప్రశ్నించారు. ప్రజలందరూ లాక్‌డౌన్ ఉన్న సమయంలో, లక్షలాది మంది ప్రజలు తమ స్వస్థలాలకు కాలినడకన వెళ్తున్న సమయంలో, ఇంకా స్వస్థలాలకు చేరుకోని సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాట్లాడటం లేదని, కనీసం వారివైపు చూడటం కూడా లేదని కపిల్ సిబల్ ధ్వజమెత్తారు. 


Updated Date - 2020-03-28T19:48:22+05:30 IST