లవ్ జిహాద్ కేసులపై సిట్ చార్జిషీటు దాఖలు

ABN , First Publish Date - 2020-11-26T16:08:37+05:30 IST

కాన్పూరులో లవ్ జిహాద్ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక పోలీసు బృందాన్ని (సిట్) ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.....

లవ్ జిహాద్ కేసులపై సిట్ చార్జిషీటు దాఖలు

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): కాన్పూరులో లవ్ జిహాద్ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక పోలీసు బృందాన్ని (సిట్) ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 14 లవ్ జిహాద్ కేసుల్లో 8 కేసుల్లో సిట్ చార్జిషీటు సమర్పించింది. 8 లవ్ జిహాద్ కేసుల్లో మూడు కేసుల్లో నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లభించాయి. ఒక లవ్ జిహాద్ కేసులో బాధిత యువతి నిందితుడికి మద్ధతుగా సాక్ష్యం చెప్పింది. కాన్పూరులో లవ్ జిహాద్ కేసుల దర్యాప్తు నివేదికను తాము సమర్పించామని కాన్పూర్ ఎస్పీ దీపక్ భూకర్ చెప్పారు. 11 లవ్ జిహాద్ కేసుల్లో 11 మందిని జైలుకు పంపించామని ఐజీపీ మొహిత్ అగర్వాల్ చెప్పారు. బల్లబ్ ఘడ్ లో 21 ఏళ్ల యువతిని కాల్చిచంపాడు. ఈ ఘటన అనంతరం యూపీసర్కారు లవ్ జిహాద్ కేసులపై ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. లవ్ జిహాద్ కేసులు, బలవంతపు మతమార్పిడులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. 

Updated Date - 2020-11-26T16:08:37+05:30 IST