వికాస్‌దూబే సన్నిహిత అనుచరుడి ఎన్‌కౌంటర్

ABN , First Publish Date - 2020-07-08T13:14:14+05:30 IST

కరడు కట్టిన కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే సన్నిహిత సహచరుడు అమర్ దూబేను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు....

వికాస్‌దూబే సన్నిహిత అనుచరుడి ఎన్‌కౌంటర్

న్యూఢిల్లీ : కరడు కట్టిన కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే సన్నిహిత అనుచరుడు అమర్ దూబేను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్ పూర్ పట్టణంలో వికాస్ దూబే అనుచరుడైన అమర్ దూబేను ప్రత్యేక పోలీసులు కాల్చి చంపారు. కాన్పూరులో 8 మంది పోలీసులను హతమార్చిన వికాస్ దూబేతోపాటు అతని ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు చెందిన 40 ప్రత్యేక పోలీసు బృందాలు వికాస్ దూబే కోసం గాలిస్తున్నాయి. అమర్ దూబే హమీర్ పూర్ లో ఉండగా పోలీసులు కాల్చిచంపారు. బిజనూర్ పట్టణంలో వికాస్ దూబే కొందరితో కలిసి కారులో వెళుతున్నట్లు పోలీసులు సోమవారం రాత్రి గుర్తించారు. యూపీతోపాటు సరిహద్దు రాష్ట్రాల్లోనూ వికాస్ దూబే సంచారంపై ఆయా రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. బిక్రూ గ్రామంలో పోలీసుల దాడికి ముందే అతని గూడాచారులైన కొందరు పోలీసులే సమాచారం అందించారని అందిన సమాచారంతో 68 మంది కాన్పూర్ పోలీసులపై బదిలీ వేటు వేశారు. వికాస్ దూబేతో సంబంధాలున్నాయనే అనుమానంతో కాన్పూర్ ఎస్పీ అనంత్ దియో తివారీని కూడా బదిలీ చేశారు.

Updated Date - 2020-07-08T13:14:14+05:30 IST