వికాస్ దుబే కేసులో కీలక పరిణామం

ABN , First Publish Date - 2020-07-08T23:01:12+05:30 IST

లక్నో: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల రెండున ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌ బిక్రూ గ్రామంలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి

వికాస్ దుబే కేసులో కీలక పరిణామం

లక్నో: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల రెండున ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌ బిక్రూ గ్రామంలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటోన్న చౌబేపూర్ మాజీ స్టేషన్ ఆఫీసర్ వినయ్ తివారి, బీట్ ఇన్‌ఛార్జ్ కేకే శర్మ అరెస్టయ్యారు. వీరిద్దరూ కాల్పులు జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నా ఘటనాస్థలం నుంచి పారిపోయారని కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. ఆపరేషన్ సమయంలో వీరు పరారవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఘటనకు ముందే ఎంతమంది పోలీసులు వస్తున్నారనే విషయాన్ని దుబేకు సమాచారం అందించారని తివారి, శర్మపై ఆరోపణలున్నాయి.  




ఈ నెల మూడున వికాస్ దుబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో డీఎస్‌పీ దేవేంద్ర మిశ్రాతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారు. దుబేకు నిరంతరం సమాచారం చేరవేసే పోలీసులపై కూడా విచారణ కొనసాగుతోంది. మొత్తం 200 మంది పోలీసులతో దుబేకు సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. వీరందరి సెల్‌ఫోన్ కాల్‌డాటా పరిశీలిస్తున్నారు.


మరోవైపు దుబే అనుచరుడు అమర్‌ దుబే హమీర్‌పూర్ జిల్లాలో పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.


అటు పరారీలో ఉన్న వికాస్ దుబే హర్యానా ఫరీదాబాద్‌‌లోని హోటల్‌లో కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. దాడి చేయగా ఈలోగానే పరారయ్యాడు. వికాస్ దుబే ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుని ఉంటాడని భావిస్తున్నారు. మొత్తం 100 పోలీసు బృందాలు దుబే కోసం యూపీ, హర్యానా, ఢిల్లీలో జల్లెడపడుతున్నాయి.              

Updated Date - 2020-07-08T23:01:12+05:30 IST