కాన్పూర్ లో కలకలం: కూరగాయలు విక్రయించిన 15 మంది కరోనా రోగులు

ABN , First Publish Date - 2020-04-21T18:37:52+05:30 IST

యూపీలోని కాన్పూర్‌లోగల అన్వర్‌గంజ్ లో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా కూరగాయల వ్యాపారం చేస్తుంటారని...

కాన్పూర్ లో కలకలం: కూరగాయలు విక్రయించిన 15 మంది కరోనా రోగులు

కాన్పూర్: యూపీలోని కాన్పూర్‌లోగల అన్వర్‌గంజ్ లో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  వీరంతా కూరగాయల వ్యాపారం చేస్తుంటారని తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే ఆరోగ్య శాఖ అధికారులు వణికిపోయారు. ఇది ఎక్కడికి దారితీస్తుందోనని భయపడుతున్నారు. ఇటువంటి  పరిస్థితిలో భారీగా  స్క్రీనింగ్ నిర్వహించాల్సి వస్తుందని భావిస్తున్నారు. తాజా కేసుల నేపథ్యంలో కూరగాయల దుకాణాలు మూసివేశారు. కాగా కాన్పూర్‌లో కరోనా వైరస్‌తో మరో వ్యక్తి మరణించాడు.

Updated Date - 2020-04-21T18:37:52+05:30 IST