మసీదులో అవగాహన కల్పించాలనుకున్న పోలీసులపై దాడి

ABN , First Publish Date - 2020-04-04T12:14:31+05:30 IST

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. అయితే ఇప్పటికీ కొంతమంది లాక్ డౌన్ ను పట్టించుకోవడం లేదు. యూపీలోని కన్నౌజ్ లో ని ఒక మసీదులో ఇలాంటి ఉదంతం వెలుగు చూసింది.

మసీదులో అవగాహన కల్పించాలనుకున్న పోలీసులపై దాడి

కన్నౌజ్: కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. అయితే ఇప్పటికీ కొంతమంది లాక్ డౌన్ ను పట్టించుకోవడం లేదు. యూపీలోని కన్నౌజ్ లో ని ఒక మసీదులో ఇలాంటి ఉదంతం వెలుగు చూసింది. నిషేధం అమలులో ఉన్నప్పటికీ కొంతమంది ప్రార్థనలు చేయడానికి గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా, వారిపై దాడి జరిగింది. ఈ విషయాన్ని కన్నౌజ్ పోలీస్ సూపరింటెండెంట్ అమరేంద్ర ప్రసాద్ తెలిపారు. దర్యాప్తు కోసం ఎల్‌ఐయూ బృందం అక్కడికి వెళ్లినప్పుడు వారిపై దాడి జరిగిందన్నారు. అల్లరిమూకలు రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇన్ స్పెక్టర్, ఎల్ఐయు ఇన్ స్పెక్టర్ తో  సహా ఒక జవాను  తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన తరువాత పోలీసులు దాడి చేసిన వారి కోసం వెతుకుతున్నారు. సంఘటన జరిగిన ప్రదేశం చుట్టూ డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగుతోంది.

Updated Date - 2020-04-04T12:14:31+05:30 IST