కమల్ హాసన్ కాస్ట్లీ క్యాంపెయిన్.. లక్షన్నర ఖర్చు చేసి మరీ..

ABN , First Publish Date - 2020-12-28T04:39:16+05:30 IST

సినీ నటుడు కమల్‌ హాసన్ తమిళ పాలిటిక్స్‌లో కొత్త సాంప్రదాయానికి తెర లేపారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా...

కమల్ హాసన్ కాస్ట్లీ క్యాంపెయిన్.. లక్షన్నర ఖర్చు చేసి మరీ..

తిరుచ్చి: సినీ నటుడు కమల్‌ హాసన్ తమిళ పాలిటిక్స్‌లో కొత్త సాంప్రదాయానికి తెర లేపారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మక్కల్ నీది మయం’ అధినేత తిరుచ్చి వెళ్లాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం కమల్ తిరుచ్చి చేరుకోవాల్సి ఉండగా.. తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై రీ-కార్పెటింగ్ పనులు జరుగుతుండటంతో చెన్నై నుంచి కమల్ ప్రయాణించిన విమానాన్ని మధురైకి మళ్లించారు. దీంతో.. మధురై నుంచి తిరుచ్చికి వెళ్లేందుకు కమల్ ప్రైవేట్ చాపర్‌‌ను బుక్ చేశారు. రోడ్డు మార్గంలో వెళితే 200 కిలోమీటర్ల లోపే ఉన్న ఈ దూరాన్ని కొన్ని గంటల్లో చేరుకోవచ్చు. అయితే.. అప్పటికే ఆలస్యమైందని భావించిన కమల్ చాపర్‌ను బుక్ చేశారు. ఈ చాపర్‌కు కమల్ కనీసం లక్షన్నర అద్దె చెల్లించినట్లు సమాచారం.


తమిళ రాజకీయాల్లో చార్టర్డ్ విమానాలు, చాపర్లతో నేతలు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సందర్భాలు అరుదుగానే ఉన్నాయి. దాదాపు లీడర్లంతా రోడ్డు మార్గంలోనో, కమర్షియల్ ఫ్లైట్లలోనో ఎన్నికల ప్రచారానికి వెళ్లేవారు. కమల్ మాత్రం అరగంటలో మధురై నుంచి తిరుచ్చి చేరుకునేందుకు చాపర్ బుక్ చేయడం గమనార్హం. తిరుచ్చి చేరుకున్న కమల్ ప్రచారానికి వెళ్లే లోపు అక్కడే ఓ లగ్జరీ హోటల్లో బస చేశారు. ఆ హోటల్ వద్దకు ఆయన అభిమానులు భారీగా చేరుకున్నారు.

Updated Date - 2020-12-28T04:39:16+05:30 IST