గవర్నత్‌తో భేటీ అయిన కమల్‌నాథ్... టెస్ట్‌కు రెడీ అన్న సీఎం
ABN , First Publish Date - 2020-03-13T20:51:04+05:30 IST
ముఖ్యమంత్రి కమల్‌నాథ్ గవర్నర్ లాల్జీ టాండన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. 22 మంది

భోపాల్ : ముఖ్యమంత్రి కమల్‌నాథ్ గవర్నర్ లాల్జీ టాండన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో రాజ్‌భవన్‌లో జరిగిన వీరిద్దరి భేటీకి ప్రాధాన్యమేర్పడింది. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్ష బీజేపీ కుట్రలు పన్నుతోందంటూ మూడు పేజీల లేఖలో సీఎం కమల్ నాథ్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులు, ఆయన సారథ్యంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేస్తున్న కుట్రలను సవివరంగా ఆయన గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.
అంతేకాకుండా బలపరీక్షకు తమ ప్రభుత్వం సదా సిద్ధంగానే ఉందని సీఎం స్పష్టం చేశారు. బెంగళూరు రిసార్టుల్లో ఉన్న 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెంటనే రాష్ట్రానికి వచ్చేలా జోక్యం చేసుకోవాలని ఆయన గవర్నర్‌కు విన్నవించారు. అయితే దాదాపు గంటపాటు సాగిన వీరిద్దరి సమావేశం ముగిసిన తర్వాత 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీడియా ముందుకు వచ్చేందుకు సీఎం నిరాకరించారు.