అది హోదా కాదు... పదవీ కాదు : కమల్‌నాథ్
ABN , First Publish Date - 2020-10-31T18:14:39+05:30 IST
తన ‘స్టార్ క్యాంపెయినర్’ హోదాను ఈసీ రద్దు చేయడంపై మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ స్పందించారు. ‘‘ఈసీ తీసుకున్న నిర్ణయంపై నేను స్పందించను.

భోపాల్ : తన ‘స్టార్ క్యాంపెయినర్’ హోదాను ఈసీ రద్దు చేయడంపై మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ స్పందించారు. ‘‘ఈసీ తీసుకున్న నిర్ణయంపై నేను స్పందించను. స్టార్ క్యాంపెయినర్ అనేది పెద్ద పదవీ కాదు... అదో హోదా కాదు. దానిపై నేనేమీ స్పందించను. నవంబర్ పదో తేదీ తర్వాత మాత్రమే స్పందిస్తా.’’ అని కమల్‌నాథ్ ప్రకటించారు.
మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కు ఈసీ షాకిచ్చింది. ‘స్టార్ క్యాంపెయినర్ హోదా’ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కమల్‌నాథ్ పదే పదే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈసీ ప్రకటించింది.