ఎలా చచ్చారో నటించి చూపాలన్నారు: కమల్‌

ABN , First Publish Date - 2020-03-18T07:42:40+05:30 IST

‘భారతీయుడు-2’ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం కేసులో విచారణ పేరుతో పోలీసులు తనను వేధిస్తున్నారంటూ నటుడు కమల్‌హాసన్‌ మంగళవారం మద్రాసు...

ఎలా చచ్చారో నటించి చూపాలన్నారు:  కమల్‌

చెన్నై, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ‘భారతీయుడు-2’ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం కేసులో విచారణ పేరుతో పోలీసులు తనను వేధిస్తున్నారంటూ నటుడు కమల్‌హాసన్‌ మంగళవారం మద్రాసు హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. గత నెల 19న షూటింగ్‌ స్పాట్‌లో క్రేన్‌ కూలి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సహా ముగ్గురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కేంద్ర నేర విభాగ పోలీసుల ఎదుట ఇదివరకే కమల్‌, దర్శకుడు శంకర్‌ విచారణకు హాజరయ్యారు. విచారణ పేరుతో పోలీసులు తనను వేధిస్తున్నారని, ముగ్గురు మరణించిన తీరును నటించి చూపించాలంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-18T07:42:40+05:30 IST