నాకు మద్దతిచ్చిన వారందరికీ థ్యాంక్స్: పైలట్‌

ABN , First Publish Date - 2020-07-15T02:40:56+05:30 IST

న్యూఢిల్లీ: తనకు మద్దతిచ్చిన వారందరికీ సచిన్ పైలట్‌ ధన్యవాదాలు తెలిపారు. రాజస్థాన్ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి, డిప్యూటీ సీఎం పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఇవాళ తొలగించింది.

నాకు మద్దతిచ్చిన వారందరికీ థ్యాంక్స్: పైలట్‌

న్యూఢిల్లీ: తనకు మద్దతిచ్చిన వారందరికీ సచిన్ పైలట్‌ ధన్యవాదాలు తెలిపారు. రాజస్థాన్ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి, డిప్యూటీ సీఎం పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఇవాళ తొలగించింది. అయితే పైలట్‌పై వేటు వేయడంపై కాంగ్రెస్ పార్టీ నుంచే ఆయనకు అనూహ్య మద్దతు లభించింది. ముఖ్యంగా యువనేతలు జితిన్ ప్రసాద, ప్రియాదత్, సంజయ్ నిరుపమ్, మిలింద్ దేవ్‌రా తదితరులు పైలట్‌కు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పైలట్ పార్టీ కోసం కష్టపడ్డారంటూ ట్వీట్లు చేశారు. యువనేతలకు పెద్ద ఆశయాలు కలిగి ఉండటం తప్పుకాదన్నారు. ఊహించని రీతిలో ఇంతమంది యువనేతలు తనకు మద్దతుగా నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.    Updated Date - 2020-07-15T02:40:56+05:30 IST