బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై సింధియా స్పందన...

ABN , First Publish Date - 2020-06-06T23:16:15+05:30 IST

ముఖ్యమంత్రితో పొసగక... బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న పుకార్లపై బీజేపీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు.

బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై సింధియా స్పందన...

భోపాల్ : ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌తో పొసగక... బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న పుకార్లపై బీజేపీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఆ పుకార్లన్నీ సత్యదూరమని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ‘‘నిజం కంటే అబద్ధమే అత్యంత వేగంగా ప్రచారం చుట్టి వస్తుంది’’ అని ట్వీట్ చేశారు.


‘‘ఇందులో ఎలాంటి సందేహమూ అవసరం లేదు. ట్వీట్‌లో ఏమి పేర్కొన్నానో అది నిజం. మీడియాలో వస్తున్న వార్తలకు ఎలాంటి ఆధారాల్లేవ్. అలాంటి పుకార్లను ప్రజలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. బీజేపీలో చేరే సమయానికి బయోలో ఏ విషయాలున్నాయో అవే ఇప్పటికీ ఉన్నాయి. బీజేపీలోకి వచ్చిన తర్వాత ట్విట్టర్‌లో ఒక్క ఫోటోనే మార్చాను. ’’ అని స్పష్టం చేశారు. సింధియా పాపులారిటీని భరించలేకే, ప్రత్యర్థులు ఇలాంటి తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని సింధియా వర్గం మండిపడుతోంది. 

Updated Date - 2020-06-06T23:16:15+05:30 IST