ప్రధాని పిలుపుపై పెదవి విరిచిన శశిథరూర్

ABN , First Publish Date - 2020-04-03T19:50:52+05:30 IST

కరోనా చీకట్లను తరిమికొట్టేందుకు దేశ ప్రజలంతా మరోసారి సంకల్పం చాటుకోవాలని, ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమషాల పాట్లు లైట్లు ఆర్పేసి కొవ్వొత్తి, దీపం వెలిగించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు..

ప్రధాని పిలుపుపై పెదవి విరిచిన శశిథరూర్

న్యూఢిల్లీ: కరోనా చీకట్లను తరిమికొట్టేందుకు దేశ ప్రజలంతా మరోసారి సంకల్పం చాటుకోవాలని, ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాట్లు లైట్లు ఆర్పేసి కొవ్వొత్తి, దీపం వెలిగించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుపై శశిథరూర్ పెదవి విరిచారు. ఇదొక 'ఫీల్ గుడ్ మూమెంట్' మాత్రమేనని అన్నారు. ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు, ఆందోళనలపై ఎలాంటి ఉపశమనం కలిగించే ప్రకటన చేయలేదని విమర్శించారు.


'ప్రజల అగచాట్లు, వారిపై పడుతున్న భారం, ఆర్థిక ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోలేదు. భవిష్యత్తు విజన్ ఏమిటో, లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత పరిస్థితులు మెరుగుపరచేందుకు ఏం చర్యలు తీసుకోనున్నారో  ప్రస్తావించ లేదు' అని శశిథరూర్  ట్వీట్‌ చేశారు. మోదీని ప్రధాన షోమ్యాన్‌గా, ఫోటోలకే పరిమితమయ్యే ప్రధానిగా కూడా ఆ ట్వీట్‌లో శశిథరూర్ సంబోధించారు.

Updated Date - 2020-04-03T19:50:52+05:30 IST