చనిపోయిన వ్యక్తి నుంచి జడ్జికి బెదిరింపు లేఖ.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2020-12-27T21:23:15+05:30 IST

మరణించిన వ్యక్తి నుంచి ఓ జడ్జికి బెదిరింపు లేఖ రావడం సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుందీ ఘటన. యూపీలోని బరేలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....

చనిపోయిన వ్యక్తి నుంచి జడ్జికి బెదిరింపు లేఖ.. అసలేం జరిగిందంటే..

లక్నో: మరణించిన వ్యక్తి నుంచి ఓ జడ్జికి బెదిరింపు లేఖ రావడం సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుందీ ఘటన. యూపీలోని బరేలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ ఫహీమ్ పాకీస్తానీ అనే వ్యక్తి నుంచి ఈ బెదిరింపు లేఖ వచ్చింది. అయితే ఫహీమ్ 2012లో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్లో మరణించాడని పోలీసులు తెలిపారు. బెదిరింపు లెటర్ రావడంతో భయపడిన జడ్జి హైకోర్టుకు విషయాన్ని చేరవేశాడు. హైకోర్టు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఫహీమ్ ఇంటికి వెళ్లారు. అయితే అతడు 8 ఏళ్ల క్రితమే ఎన్‌కౌంటర్లో మరణించినట్లు తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. ఈ విషయాన్నే జడ్జికి తెలియజేశారు. అయితే ఉత్తరం ఎవరు పంపించారో తెలుసుకోవాల్సి ఉందని, కేసు విచారణ కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.


Updated Date - 2020-12-27T21:23:15+05:30 IST