వసీం బారి హత్య పిరికిపందల చర్య: నద్దా
ABN , First Publish Date - 2020-07-09T05:29:27+05:30 IST
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో బీజేపీ నేత వసీం బారి కుటుంబాన్ని ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా పిరికిపందల చర్యగా అభివర్ణించారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో బీజేపీ నేత వసీం బారి కుటుంబాన్ని ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. బారి కుటుంబానికి ఆయన సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.
బండిపోరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడైన వసీం బారిని, ఆయన తండ్రిని, సోదరుడిని రాత్రి 9 గంటల సమయంలో ఉగ్రవాదులు కాల్చిచంపారు. వసీం బారి దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. వసీం బారి దుకాణం సరిగ్గా పోలీస్ స్టేషన్‌కు ఎదురుగానే ఉంటుంది. వసీం బారికి రక్షణ కల్పిస్తోన్న మొత్తం 8 మంది రక్షణ సిబ్బందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.