నితీశ్ తో భేటీ కానున్న జేపీ నడ్డా

ABN , First Publish Date - 2020-09-12T15:21:24+05:30 IST

జేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం బిహార్ సీఎం నితీశ్‌ కుమార్ తో భేటీ కానున్నారు. రాబోయే

నితీశ్ తో భేటీ కానున్న జేపీ నడ్డా

పాట్నా : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం బిహార్ సీఎం నితీశ్‌ కుమార్ తో భేటీ కానున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపిణీ, పొత్తు విషయాలపై వీరిద్దరి మధ్య చర్చ జరగనుంది. మరోవైపు ఎన్డీయేలో భాగస్వామి అయిన ఎల్జేపీ, జేడీయూ భేటీ కూడా నేడు జరగనుంది. కొన్ని రోజులుగా నితీశ్‌కు వ్యతిరేకంగా ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఎల్జేపీతో పొత్తు ఉండాలా? వద్దా? అన్న తుది నిర్ణయాన్ని కూడా జేపీ నడ్డా తీసుకోనున్నారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2020-09-12T15:21:24+05:30 IST