కరోనాతో మరణించే జర్నలిస్టులను కోవిడ్ యోధులుగా ప్రకటించాలి: పీసీఐ

ABN , First Publish Date - 2020-12-03T23:04:27+05:30 IST

కరోనాతో మరణించే జర్నలిస్టులను కోవిడ్ యోధులుగా ప్రకటించాలి: పీసీఐ

కరోనాతో మరణించే జర్నలిస్టులను కోవిడ్ యోధులుగా ప్రకటించాలి: పీసీఐ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి పీసీఐ పలు సూచనలు చేసింది. కరోనా వైరస్‌తో మరణించే జర్నలిస్టులను కోవిడ్ -19 యోధులుగా ప్రకటించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కేంద్రాన్ని కోరింది.


కోవిడ్-19 కారణంగా మరణించిన జర్నలిస్టులను వైద్యులు మరియు ఇతరులు వంటి కోవిడ్-19 యోధుల విభాగంలో చేర్చాలని కౌన్సిల్ సిఫారసు చేసింది. వారికి అదే ప్రయోజనాలను అందించాలని పీఐసీ పేర్కొంది. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, ప్రెస్ అసోసియేషన్లు కూడా పీఎంకు లేఖ రాశాయి.

Updated Date - 2020-12-03T23:04:27+05:30 IST