పబ్జీపై బ్యాన్‌పై పేలుతున్న జోకులు
ABN , First Publish Date - 2020-09-03T23:34:39+05:30 IST
పబ్జీపై బ్యాన్‌పై పేలుతున్న జోకులు

మోదీ సర్కార్ పబ్జీ ఆటకట్టించడం కొందరికి ఖేదం మిగిలిస్తే మరికొందరికి మోదంగా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ పెరుగుతున్నాయి. పబ్జీ బ్యాన్‌పై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తూ ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మోదీ పబ్జీని ఎందుకు బ్యాన్ చేశారో తెలుసంటూ అంకిత్ అనే వ్యక్తి పోస్ట్ చేసిన సరదా వీడియో వైరల్‌గా మారింది.
ఈ పరిణామాల క్రమంలో అంటూ ఆ వీడియోను రూపొందించాడు. మోదీ ఇటీవల చేసిన మన్ కీ బాత్ ప్రసంగం వీడియోకు ఏకంగా పది లక్షలకు పైగా డిస్ లైకులు వచ్చాయి. మోదీ మన్ కీ బాత్ వీడియోలకు గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో డిస్ లైకులు రాలేదు. జేఈఈ పరీక్షలు వాయిదా వేయకపోవడాన్ని నిరసిస్తూ ఎక్కువ మంది విద్యార్థులే డిస్ లైకులు చేసినట్లు తెలుస్తోంది.
నా వీడియోకు డిస్ లైకులు చేస్తారా?. మీ పబ్జీని నేను బ్యాన్ చేస్తానంటూ మోదీ కన్నెర్ర చేశారంటూ సరదా కామెంట్లు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. పబ్జీని ఆడేది ఎక్కువ మంది విద్యార్థులు, యువతే. పబ్జీ బ్యాన్‌తో పేరెంట్స్ ఖుషీకి అంతేలేదంటూ మరికొందరు వీడియోలను పోస్ట్ చేశారు. పేరెంట్స్ డాన్సులు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి చిలిపి కామెంట్లు చేస్తున్నారు.
చైనాకు చెందిన మొబైల్ గేమ్ యాప్ పబ్జీ అంటే దేశంలో కోట్లాది మంది యువతీ, యువకులు మనసు పారేసుకున్నారు. కేవలం పబ్జీ గేమ్ ఆడేందుకే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసిన వారు కూడా ఉన్నారు. తొలుత ప్లే స్టేషన్లు, కంప్యూటర్లలో అందుబాటులో ఉన్న పబ్జీ గేమ్‌ను 2018, ఫిబ్రవరి 9 నుంచి భారత్‌లో మొబైల్ వర్షన్‌ను లాంఛ్ చేశారు. విడుదలైన తొలి ఏడాదే ప్లే స్టోర్‌లో ఉత్తమ మొబైల్ యాప్‌గా నిలిచింది. దీంతో క్రేజ్ సంపాదించింది.
మరోవైపు భారత్‌లో పబ్‌జీపై వేటు పడటంతో ఆ యాప్‌ను రూపొందించిన టెన్సెంట్‌కు 14 బిలియన్ డాలర్ల(దాదాపు లక్ష కోట్ల రూపాయలు) నష్టం వాటిల్లిందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.