ప్రముఖ సింగర్‌కు కరోనా!

ABN , First Publish Date - 2020-03-29T00:32:58+05:30 IST

ప్రముఖ సింగర్, అకాడమీ అవార్డు గ్రహీత జో డిఫీకి కూడా ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జో స్వయంగా వెల్లడించారు.

ప్రముఖ సింగర్‌కు కరోనా!

లాస్ ఏంజెల్స్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ వైరస్ విశ్వరూపం చూపుతోంది. ఇక్కడ ఇప్పటికే లక్షపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్, అకాడమీ అవార్డు గ్రహీత జో డిఫీకి కూడా ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జో స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించిన ఆయన.. తన అభిమానులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరోనా మహమ్మారి అమెరికాను అల్లకల్లోలం చేస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా, కరోనా పుట్టినిల్లయిన చైనాలో కంటే అమెరికాలోని ఎక్కువమందికి ఈ వైరస్ సోకిన విషయం తెలిసిందే.


Updated Date - 2020-03-29T00:32:58+05:30 IST