రైల్వేల్లో ఉద్యోగ నియామకాలు షురూ

ABN , First Publish Date - 2020-09-06T07:22:31+05:30 IST

రోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న భారతీయ రైల్వేల్లో ఉద్యోగ నియామకాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.

రైల్వేల్లో ఉద్యోగ నియామకాలు షురూ

డిసెంబరు 15 నుంచి ఆన్‌లైన్‌ పరీక్షలు

మూడు కేటగిరీల్లో 1.4 లక్షల పోస్టుల భర్తీ: వీకే యాదవ్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న భారతీయ రైల్వేల్లో ఉద్యోగ నియామకాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. మూడు కేటగిరీల్లో 1.40 లక్షల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం డిసెంబరు 15 నుంచి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 35,208 నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ్‌స(ఎన్‌టీపీసీ), 1,663 మినిస్టీరియల్‌, 1,03,769 లెవల్‌ వన్‌ వేకెన్సీల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తామని, పూర్తి షెడ్యూలును త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ పోస్టులకు దాదాపు 2.42 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-09-06T07:22:31+05:30 IST