అకాడెమిక్ క్యాలెండ‌ర్‌ను ప్రకటించిన జేఎన్‌యూ

ABN , First Publish Date - 2020-05-10T20:40:28+05:30 IST

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) త‌న అకాడెమిక్ క్యాలెండ‌ర్‌ను ప్ర‌క‌టించింది. సిల‌బ‌స్ పూర్తి చేయ‌డంతో పాటు, జులై 31 వ తేదీ లోగా ప‌రీక్ష‌లు పూర్తి చేయ‌డానికి తేదీల‌ను నిర్ణ‌యించింది. అకాడెమిక్ క్యాలెండ‌ర్‌ను అన్ని కాలేజీల డీన్‌లు, స్పెష‌ల్ సెంట‌ర్స్ చైర్‌ప‌ర్స‌న‌లు ఏక‌గ్రీవంగా ఆమోదించార‌ని జేఎన్‌యూ వైస్ ‌ఛాన్సల‌ర్ జ‌గ‌దీశ్‌కుమార్ తెలిపారు.

అకాడెమిక్ క్యాలెండ‌ర్‌ను ప్రకటించిన జేఎన్‌యూ

హైదరాబాద్ : జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) త‌న అకాడెమిక్ క్యాలెండ‌ర్‌ను ప్ర‌క‌టించింది. సిల‌బ‌స్ పూర్తి చేయ‌డంతో పాటు, జులై 31 వ తేదీ లోగా ప‌రీక్ష‌లు పూర్తి చేయ‌డానికి తేదీల‌ను నిర్ణ‌యించింది. అకాడెమిక్ క్యాలెండ‌ర్‌ను అన్ని కాలేజీల డీన్‌లు, స్పెష‌ల్ సెంట‌ర్స్ చైర్‌ప‌ర్స‌న‌లు ఏక‌గ్రీవంగా ఆమోదించార‌ని జేఎన్‌యూ వైస్  ‌ఛాన్సల‌ర్ జ‌గ‌దీశ్‌కుమార్ తెలిపారు.


ద్యార్థులు జూన్ 25 వ తేదీ నుంచి 30 వ తేదీ వ‌ర‌కు క్యాంప‌స్‌కు తిరిగి వ‌చ్చేలా ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. మిగిలిన పాఠ్యాంశాల‌ను పూర్తి చేసి జులై 31వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు పూర్తి చేస్తామ‌న్నారు. ఫ‌స్ట్ ఇయ‌ర్‌, సెకండ్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు త‌దుప‌రి సెమిస్ట‌ర్ త‌ర‌గ‌తులు ఆగ‌స్టు ఒకటిన ప్రారంభ‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు.


ఈ అకాడెమిక్ క్యాలెండ‌ర్ తాత్కాలిక‌మైన‌దే. యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాలు, లాక్‌డౌన్ ప‌రిస్థితి, క‌రోనా వ్యాప్తి తదుపరి అంశాలననుస‌రించి ప్ర‌భుత్వం నిర్ణ‌యించే అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని పేర్కొన్నారు.

Updated Date - 2020-05-10T20:40:28+05:30 IST