జియో ఫోన్ 3 గురించి ప్రకటన ఉండనుందా..!

ABN , First Publish Date - 2020-07-15T07:00:07+05:30 IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారుల 43వ వార్షిక సమావేశం (ఏజీఎం) బుధవారం జరగనుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో..

జియో ఫోన్ 3 గురించి ప్రకటన ఉండనుందా..!

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారుల 43వ వార్షిక సమావేశం (ఏజీఎం) బుధవారం జరగనుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో రిలయన్స్‌ తొలిసారిగా వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహించబోతోంది. రిలయన్స్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఏజీఎంలో పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని మార్గెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే.. ఈ వార్షిక సమావేశంలో జియో ఫోన్ 3ని ఆవిష్కరించే అవకాశమున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే గత వార్షిక సమావేశాల్లో భాగంగా జియో ఫోన్‌ను, జియో ఫోన్ 2ను విడుదల చేశారు. జియో ఫోన్ 3గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకూ ఈ ఫోన్ ఫీచర్లు గానీ, ధర గురించి గానీ స్పష్టత రాలేదు.

Updated Date - 2020-07-15T07:00:07+05:30 IST