జార్ఖండ్‌లో గరిష్ట స్థాయిని తాకిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-29T05:29:12+05:30 IST

జార్ఖండ్‌లో కరోనా కేసులు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒకేరోజు ఇక్కడ 686 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకేరోజు ఇన్ని కేసులు

జార్ఖండ్‌లో గరిష్ట స్థాయిని తాకిన కరోనా కేసులు

రాంచీ: జార్ఖండ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా ఇక్కడ 686 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కొత్తగా ఇన్ఫెక్షన్ సోకిన వారితో కలిపి మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 9,563కి చేరినట్టు అధికారులు వెల్లడించారు. ఇవాళ మరో కరోనా పేషెంట్ ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 94కి పెరిగింది. ప్రస్తుతం 5,485 యాక్టివ్ కేసులు ఉన్నట్టు జార్ఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 179 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,984కి పెరిగింది.
Updated Date - 2020-07-29T05:29:12+05:30 IST