భర్త మృతదేహం కోసం మేకను విక్రయించి...

ABN , First Publish Date - 2020-03-12T17:46:16+05:30 IST

అడవిలో దేవ్ చరణ్ సింగ్‌ అనే వ్యక్తిపై హైనాలు దాడి చేశాయి. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులు బాధితునికి వైద్య చికిత్స అందించేందుకు...

భర్త మృతదేహం కోసం మేకను విక్రయించి...

లాతెహార్: అడవిలో దేవ్ చరణ్ సింగ్‌ అనే వ్యక్తిపై హైనాలు దాడి చేశాయి. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులు బాధితునికి వైద్య చికిత్స అందించేందుకు రాంచీ(ఛత్తీస్ గఢ్)లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు వారాలపాటు చికిత్స పొందిన అనంతరం దేవ్ చరణ్ సింగ్‌ మృతి చెందాడు. కాగా తన భర్త దేవ్ చరణ్ సింగ్ మృతికి అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం, రిమ్స్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ చరకీ దేవి ఆరోపిస్తోంది. కాగా దేవ్ చరణ్ సింగ్ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని చరకీ దేవీ నర్సును కోరింది. అయితే వాహనం అందుబాటులో లేదని నర్సు తెలిపింది. కాగా అప్పటికే భర్త  చికిత్స కోసం ఇంటిలోని ఒక మేకను అమ్మిన చరకీ దేవి మరో మేకను కూడా అమ్మి డబ్బులు ఏర్పాటు చేసుకుని, ప్రైవేటు వాహనంలో భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చింది. గ్రామంలో భర్తకు దహన సంస్కారాలు నిర్వహించింది.

Updated Date - 2020-03-12T17:46:16+05:30 IST