కరోనా నెగెటివ్ వచ్చిన మరుసటి రోజే మంత్రి మృతి!

ABN , First Publish Date - 2020-10-04T02:37:25+05:30 IST

ఝార్ఖండ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి హజీ హుస్సేన్ అన్సారీ శనివారం నాడు ఆస్పత్రిలో మృతి చెందారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కరోనా నెగెటివ్ వచ్చిన మరుసటి రోజే మంత్రి మృతి!

రాంచీ: ఝార్ఖండ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి హజీ హుస్సేన్ అన్సారీ శనివారం నాడు ఆస్పత్రిలో మృతి చెందారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం నాడు జరిపిన పరీక్షలో కరోనా నెగెటివ్ అన వచ్చింది. కరోనాను ఆయన జయించారు అనుకుంటుండగా..మరుసటి రోజు ఆయన మృతి చెందారు. కాగా.. మంత్రి మృతిపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ విచారం వ్యక్తం చేశారు. మంత్రి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘అన్సారీ ఓ మాస్ లీడర్. ఆయనో సింపుల్ వ్యక్తి’ అంటూ సీఎం విచారం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-10-04T02:37:25+05:30 IST