లాలూ కేసు విచారణ డిసెంబర్ 11కు వాయిదా

ABN , First Publish Date - 2020-11-27T19:12:15+05:30 IST

లాలూ కేసు విచారణ డిసెంబర్ 11కు వాయిదా

లాలూ కేసు విచారణ డిసెంబర్ 11కు వాయిదా

రాంచీ: దానా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ బెయిల్ పిటిషన్ విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేస్తున్నట్లు జార్ఖండ్ హైకోర్టు ప్రకటించింది. కాగా లాలూ ప్రసాద్ యాదవ్ శిక్షకు సంబంధించిన కొన్ని రికార్డులను కింది కోర్టు నుంచి తీసుకు రావాలని, తదుపరి విచారణలో వాటిని కోర్టు ముందు ఉంచాలని ధర్మాసనం పేర్కొన్నట్లు లాలూ ప్రసాద్ తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ ప్రభాత్ కుమార్ తెలిపారు.


అయితే దీనిపై ఆర్జేడీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తమకు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందని, లాలూకి తొందరలోనే బెయిల్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘లాలూకు బెయిల్ పిటిషన్ వాయిదా పడ్డప్పుడల్లా పార్టీ కార్యకర్తలంతా ఎంతో నిరాశకు గురవుతారు. తొందరలోనే న్యాయం జరుగుతుందని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాం. జైలు నియమాలన్నింటికీ లాలూ కట్టుబడి ఉన్నారు’’ అని ఆర్జేడీ నేత స్మిత లక్రా అన్నారు.

Read more