గుట్టుచప్పుడు కాకుండా ఉగ్రవాదులకు ఆశ్రయం.. పసిగట్టి పట్టుకున్న పోలీసులు!

ABN , First Publish Date - 2020-12-11T03:02:59+05:30 IST

జైషే మహ్మద్ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ రహస్యంగా మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు చేరవేస్తున్న ఓ ఉగ్రవాదిని...

గుట్టుచప్పుడు కాకుండా ఉగ్రవాదులకు ఆశ్రయం.. పసిగట్టి పట్టుకున్న పోలీసులు!

అవంతిపొరా: జైషే మహ్మద్ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ రహస్యంగా మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు చేరవేస్తున్న ఓ ఉగ్రవాదిని జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం అవంతిపొర ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సదరు ఉగ్రవాదిని ఇర్షద్ అహ్మద్ రేషిగా గుర్తించారు. జమ్మూ కశ్మీర్‌లోని ట్రాల్, అవంతిపొర ప్రాంతంలో ఉగ్రవాదులకు అవసరమైన వస్తువులు, ఆయుధాలను అతడు రవాణా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇర్షద్ నివాసం నుంచి ఐదు కిలోల గంజాయి పొడి, 10 డిటోనేటర్లు, ఓ వైర్‌లెస్ సెట్, రెండు వైర్‌లెస్ యాంటెనాలు, ఓ ఐఈడీ రిమోట్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. ఇర్షద్‌పై ట్రాల్ పోలీస్‌ స్టేషనలో కేసు నమోదు చేశారు. కాగా నిన్న బుద్గాంలో రోజువారీ తనిఖీల సందర్భంగా జైషే మహ్మద్‌కు చెందిన మరో  ఉగ్రవాది తారిఖ్ అహ్మద్ భట్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడి వద్ద నుంచి ఓ తుపాకీ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-12-11T03:02:59+05:30 IST