టేకాఫ్‌ సమయంలో రన్‌వేపై జీపు

ABN , First Publish Date - 2020-02-16T07:30:25+05:30 IST

పుణె విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏ321 విమానానికి పెనుప్రమాదం తప్పింది. శనివారం ఉదయం విమానం టేకాఫ్‌ సమయంలో రన్‌వే మీద ఓ జీపు, మనిషి ఉండటంతో పైలట్‌ వెంటనే విమానాన్ని గాల్లో ఎగిరేలా

టేకాఫ్‌ సమయంలో రన్‌వేపై జీపు

  • పుణెలో ఎయిర్‌ ఇండియా విమానానికి తప్పిన ముప్పు


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: పుణె విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏ321 విమానానికి పెనుప్రమాదం తప్పింది. శనివారం ఉదయం విమానం టేకాఫ్‌ సమయంలో రన్‌వే మీద  ఓ జీపు, మనిషి ఉండటంతో పైలట్‌ వెంటనే విమానాన్ని గాల్లో ఎగిరేలా చేశారు. ఆ సమయంలో వి మానం 120 నాట్స్‌ వేగంతో ఉంది. ఒక్కసారిగా పైకి ఎగరడంతో విమా నం బాడీ దెబ్బతింది. ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగలేదు. విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరుగుతోందని డీజీసీఏ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-02-16T07:30:25+05:30 IST