115 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన జేడీయూ

ABN , First Publish Date - 2020-10-08T01:45:13+05:30 IST

115 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన జేడీయూ

115 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన జేడీయూ

పాట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 115 మంది అభ్యర్థుల జాబితాను జనతాదళ్ (యునైటెడ్) బుధవారం విడుదల చేసింది. పార్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్‌జేడీ మాజీ నాయకుడు చంద్రిక రాయ్‌కు టికెట్ ఇచ్చారు. మాధేపుర నుంచి నిఖిల్ మండల్, ఫుల్వారీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అరుణ్ మంజి పోటీ చేయనున్నారు. చెరియా బారియార్‌పూర్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కుమారి మంజు వర్మ పోటీ చేయనున్నారు.

Read more