కూటమి రాజకీయాలకు మంచిది కాదు
ABN , First Publish Date - 2020-12-28T08:42:29+05:30 IST
అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీలో చేరడంపై ఆ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఎంతో వ్యధకు గురిచేస్తోందని జేడీయూ సీనియర్ నాయకుడు కేసీ త్యాగి అన్నారు...

- అరుణాచల్‌లో తమ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై జేడీయూ
న్యూఢిల్లీ, డిసెంబరు 27: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీలో చేరడంపై ఆ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఎంతో వ్యధకు గురిచేస్తోందని జేడీయూ సీనియర్ నాయకుడు కేసీ త్యాగి అన్నారు. ఆదివారం పట్నాలో మీడియాతో ఆయన మాట్లాడారు. కూటమి రాజకీయాల్లో ఇటువంటి పరిణామాలు మంచివి కావన్నారు.