జేడీయూ-122, బీజేపీ 121

ABN , First Publish Date - 2020-10-07T08:29:30+05:30 IST

బిహార్‌లో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చింది. దీని ప్రకారం జేడీయూ 122 స్థానాలకు, బీజేపీ 121 స్థానాలకు పోటీచేస్తాయి...

జేడీయూ-122, బీజేపీ 121

  • బిహార్‌ ఎన్‌డీఏ సీట్ల ఒప్పందం ఖరారు

పట్నా, అక్టోబరు 6: బిహార్‌లో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చింది. దీని ప్రకారం జేడీయూ 122 స్థానాలకు, బీజేపీ 121 స్థానాలకు పోటీచేస్తాయి. ఈ రెండు పార్టీలూ తమ తమ కోటాల్లోంచి మిగిలిన చిన్న భాగస్వామ్య పక్షాలకు సీట్లు కేటాయిస్తాయని జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ చెప్పారు. మాజీ సీఎం జితిన్‌రామ్‌ మాంఝీ నేతృత్వంలోని హిందూస్థాన్‌ ఆవామీ మోర్చా (హమ్‌) పార్టీకి 7 స్థానాలను జేడీయూ కేటాయిస్తుందని, ముఖేశ్‌ సాహ్ని నేతృత్వంలోని వికా్‌సశీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ)కి బీజేపీ 6 సీట్లను ఇస్తుందని ఆయన తెలిపారు. వీఐపీ కొద్దిరోజుల కిందటే మహాకూటమి నుంచి బయటకొచ్చి ఎన్‌డీఏలో చేరింది. కాగా- సీట్ల సర్దుబాటుకు నితీశ్‌ కాస్త దిగివచ్చారని, దీనికి కారణం చిరాగ్‌ పసవాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ ఇచ్చిన షాక్‌ ట్రీట్‌మెంట్‌ అని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి జేడీయూ 140కి పైగా స్థానాల్లో పోటీచేసి, బీజేపీకి 100 స్థానాలు మాత్రమే ఇవ్వాలని భావించిందనీ, కానీ పసవాన్‌ బీజేపీకి సానుకూలంగా, తనకు వ్యతిరేకంగా గళమెత్తడంతో నితీశ్‌ దిగివచ్చారని పేర్కొంటున్నారు. 

Read more