రెండింటికే రాహుల్ హాజరయ్యారు.... పైగా వాకౌటా? జవదేకర్ ఫైర్
ABN , First Publish Date - 2020-12-17T19:21:09+05:30 IST
రక్షణ శాఖ పార్లమెంటరీ ప్యానల్ సమావేశం నుంచి రాహుల్ గాంధీ మధ్యలోనే నిష్క్రమించడంపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా

న్యూఢిల్లీ : రక్షణ శాఖ పార్లమెంటరీ ప్యానల్ సమావేశం నుంచి రాహుల్ గాంధీ మధ్యలోనే నిష్క్రమించడంపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా మండిపడ్డారు. రక్షణ శాఖకు సంబంధించిన పార్లమెంట్ ప్యానల్ సమావేశాలు మొత్తం 14 జరిగితే అందులో 2 సమావేశాలకు మాత్రమే రాహుల్ గాంధీ హాజరయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘రక్షణ శాఖ పార్లమెంటరీ ప్యానల్ సమావేశాలు మొత్తం 14 జరిగాయి. అందులో రాహుల్ గాంధీ రెండింటికి మాత్రమే హాజరయ్యారు. మిగితా వాటికి హాజరు కాలేదు. అయినా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను నిందిస్తున్నారు. అంతేకాకుండా నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశారు.’’ అంటూ ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు.
రక్షణ శాఖలో యూనిఫామ్, హోదాల గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం నుంచి రాహుల్ గాంధీ మధ్యలోనే నిష్క్రమించారు. ఆయనతో పాటే రాజీవ్ సతావ్, రేవంత్‌రెడ్డి తదితర కాంగ్రెస్ సభ్యులూ వాకౌట్ చేశారని అంతర్గత వర్గాలు వెల్లడించాయి.