మంత్రికి కరోనా., సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి జార్ఖండ్ సీఎం

ABN , First Publish Date - 2020-07-08T22:13:18+05:30 IST

రాష్ట్ర మంత్రి మిథిలేష్ ఠాకూర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా... ఇటీవలే ఆ మంత్రితో సమావేశం జరిగిన నేపధ్యంలో... ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా స్వీయ నిర్భందంలోకి వెళ్ళిపోయారు. వాస్తవానికి... ముఖ్యమంత్రికి ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్ళినట్లు అధికారులు వెల్లడించారు.

మంత్రికి కరోనా., సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి జార్ఖండ్ సీఎం

రాంచీ : రాష్ట్ర మంత్రి మిథిలేష్ ఠాకూర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా...  ఇటీవలే ఆ మంత్రితో సమావేశం జరిగిన నేపధ్యంలో... ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా స్వీయ నిర్భందంలోకి వెళ్ళిపోయారు. వాస్తవానికి...  ముఖ్యమంత్రికి ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్ళినట్లు అధికారులు వెల్లడించారు.


సీఎంతో పాటు ఆయన  కార్యాలయాధికారులు, సిబ్బందిని హోం క్వారంటైన్ లోనే ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం కార్యాలయంలోకి వచ్చే సందర్శకులపై కూడా పలు నిబంధనలను విధించారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 3,056 కరోనా పాజిటివ్ కేసులు రమొదు కాగా, వీరిలో 22 మంది మృత్యువాత పడ్డారు. 

Updated Date - 2020-07-08T22:13:18+05:30 IST