డైమండ్ ప్రిన్సెస్ ఓడలో 39 మందికి కరోనా వైరస్

ABN , First Publish Date - 2020-02-12T15:06:41+05:30 IST

జపాన్ దేశ క్రూయిజ్ షిప్‌లో 39 మందికి కరోనా వైరస్ సోకిందని వైద్యపరీక్షలో తేలడంతో వారందరినీ నిర్బంధంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.....

డైమండ్ ప్రిన్సెస్ ఓడలో 39 మందికి కరోనా వైరస్

టోక్యో (జపాన్): జపాన్ దేశ క్రూయిజ్ షిప్‌లో 39 మందికి కరోనా వైరస్ సోకిందని వైద్యపరీక్షలో తేలడంతో వారందరినీ నిర్బంధంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జపాన్ దేశానికి చెందిన డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో 3,700 మంది ఉండగా, వారిలో 1100మంది సిబ్బంది. టోక్యో నగరానికి దక్షిణంగా ఉన్న యోకోహామా సమీపంలోని సముద్రంలోనే నిలిపి కరోనా వైరస్ ప్రబలకుండా చికిత్స అందిస్తున్నారు. ఈ ఓడలో నుంచి హాంకాంగ్ లో దిగిన ఓ ప్రయాణికుడికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఓడలోని వారందరినీ రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంచారు. ఓడలో నిర్బంధంలో ఉన్నవారిలో 39 మందికి కరోనావైరస్ సోకగా వారిలో పదిమంది జపాన్ దేశస్థులున్నారు. మరో 10 మంది ఓడ సిబ్బంది. మిగతా రోగులు అమెరికా,చైనా దేశాలకు చెందిన వారని జపాన్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. నౌకలోని ప్రయాణికులను క్యాబిన్లలోనే ఉంచి మాస్కులు ఇచ్చి చికిత్స చేస్తున్నారు. వ్యాధి తగ్గితే ఈ నెల 19వతేదీన ఓడ నుంచి వారిని విడుదల చేయాలని జపాన్ వైద్యాధికారులు యోచిస్తున్నారు.

Updated Date - 2020-02-12T15:06:41+05:30 IST